నన్ను ఏమైనా చంపేస్తారా?: మాగంటి సునీత
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై BRS అభ్యర్థి మాగంటి సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు పారదర్శకంగా జరగడం లేదన్నారు. కాంగ్రెస్.. తమ నాయకులపై దాడులకు పాల్పడుతుందన్నారు. DY.CM భట్టి, ఎమ్మెల్యేలకు ఇక్కడ పనేంటి అని ప్రశ్నించారు. నవీన్ యాదవ్ మనుషులు తనని బెదిరిస్తున్నారని.. 'నన్ను ఏమైనా చంపేస్తారా'? అంటూ పేర్కొన్నారు. రౌడీషీటర్లకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారన్నారు.