బాలిక మృతిపై విద్యాశాఖ అధికారుల సంతాపం
TPT: ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి మృతి చెందిన సుస్మిత పార్థివ దేహాన్ని ఏర్పేడు మండల విద్యాశాఖ అధికారులు ప్రేమలత, దయాకర్ రావు సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు రాధాకృష్ణ, ఉపాధ్యాయులు, సీఆర్పీలు గురువారెడ్డి దేవరాజులు, వెంకటముని, సురేష్, మునీశ్వర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తహసీల్దార్‌కు ఈ విషయం తెలియజేసి కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు.