VIDEO: బైక్‌ను ఢీ కొట్టిన ఆటో.. దంపతులకు తీవ్ర గాయాలు..

VIDEO: బైక్‌ను ఢీ కొట్టిన ఆటో.. దంపతులకు తీవ్ర గాయాలు..

WGL: వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై వర్థన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసదుకుంది. ఒక ట్రాలీ ఆటో అతివేగంగా వెళ్తూ ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పర్వతగిరి మండలం గోపనపల్లి గ్రామానికి చెందిన చంద్రమౌళి దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.