VIDEO: ఘనంగా గోపాల కాల మహోత్సవం
SRD: ఖేడ్ మండలం చాప్టా (కే) హనుమాన్ మందిరంలో జరుగుతున్న వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం గోపాలకాల మహోత్సవం వైభవంగా నిర్వహించారు. గత వారం రోజులుగా అఖండ హరినామ సప్తహం, భజనలు, కీర్తనలు నిర్వహించారు. ఇవాళతో కార్యక్రమాలు ముగియనున్నాయి. అంబదాస్ మహారాజ్ ఆధ్వర్యంలో కాలా కీర్తన నిర్వహించారు. అనంతరం సాంప్రదాయ పద్ధతిలో ప్రసాద మట్టి పాత్రను పగులగొట్టి ప్రసాదాన్ని పంపిణీ చేశారు.