వైసీపీ దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి: చమర్తి
అన్నమయ్య: CM చంద్రబాబు నాయుడుకు ఉన్న అనుభవంతో సమర్థవంతంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని, వైసీపీ దుష్ప్రచారాలను TDP పార్టీ నాయకులు,కార్యకర్తలు తిప్పి కొట్టాలని రాజంపేట టీడీపీ ఇంఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు తెలిపారు. శనివారం రాజంపేటలోని టీడీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.