VIDEO: భారీ వర్షం.. రైతులలో ఆందోళన
MBNR: కౌకుంట్ల మండల కేంద్రంలో ఇవాళ ఆకాశం మేఘావృతమై మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. ఈ వర్షానకి రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరి పైర్లు కోత దశలో ఉంన్నాయని, పత్తి పంట ఇటీవల కురిసిన వర్షాలకు దిగుబడి తగ్గిందని, ఈ వర్షంతో పత్తి తడిసి మరింత నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.