వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు రేవేంద్రపాడు క్రీడాకారిణులు ఎంపిక

వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు రేవేంద్రపాడు క్రీడాకారిణులు ఎంపిక

GNTR: రేవేంద్రపాడు గ్రామానికి చెందిన ఇద్దరు క్రీడాకారిణులు గురువారం రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికయ్యారు. స్థానిక జడ్పీ హైస్కూల్‌లో చదువుతున్న ఆశాజ్యోతి, హర్షిత ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన జోనల్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. 86 కిలోల విభాగంలో ఆశాజ్యోతి గోల్డ్ మెడల్ సాధించగా, హర్షిత సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు.