నవంబర్ 11 నుంచి ధరూర్ మెథడిస్ట్ జాతర
VKB: ధరూర్ మెథడిస్ట్ క్రిస్టియన్ జాతర నవంబర్ 11న ప్రారంభమై నవంబర్ 16తో ముగుస్తుందని జాతర కమిటీ తెలిపింది. ఈ సంవత్సరం కూడా దాదాపు 10 లక్షల మంది యాత్రికులు వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. జాతర కోసం వచ్చే భక్తుల కోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.