పకడ్బందీగా పదవ తరగతి పరీక్షల నిర్వహణ
JGL: పకడ్బందీగా పదవ తరగతి పరీక్షలను నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత అన్నారు. జగిత్యాల పట్టణంలోని పురాణపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాన్ని శనివారం వారు పరిశీలించారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చడంపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టాలన్నారు.