మహిళపై దాడి కేసు నమోదు

మహిళపై దాడి కేసు నమోదు

WNP: రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలో ముద్దం వెంకటమ్మపై అదే గ్రామానికి చెందిన ప్రతాప్ రెడ్డి, విజయమ్మ, చంద్రకళ, సుధాకర్ రెడ్డి దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రేవల్లి ఎస్సై రజిత కేసు నమోదు చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్‌సైట్ ఎఫ్ఎఆర్ ద్వారా కేసు నమోదు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.