మంత్రిని కలిసిన పలు కంపెనీల ప్రతినిధులు

మంత్రిని కలిసిన పలు కంపెనీల ప్రతినిధులు

AP: సచివాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని త్సల్లా ఏరో స్పేస్, వెక్రోస్ టెక్నాలజీస్, ఎక్సో డ్రోన్ సిస్టమ్స్ ప్రతినిధులు కలిశారు. రాష్ట్రంలో డ్రోన్-ఏరోస్పేస్ రంగంలో పెట్టుబడులకు మూడు కంపెనీలు ఆసక్తి చూపినట్లు మంత్రి తెలిపారు. ఈ మేరకు ప్రతిపాదనలను సమర్పించినట్లు చెప్పారు. ఐదేళ్లలో రూ.500 కోట్లకు పైగా పెట్టుబడులకు త్సల్లా ఏరోస్పేస్ అంగీకారం తెలిపిందన్నారు.