కేంద్రానికి పంజాబ్ సీఎం హెచ్చరిక
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పంజాబ్ రాజధాని చండీగఢ్‌ను లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ సంచలన ఆరోపణలు చేశారు. చండీగఢ్‌లో చట్టాలు చేసే అధికారాన్ని రాష్ట్రపతి పరిధిలోకి తీసుకురావాలని కేంద్రం ఆలోచిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. చండీగఢ్‌తో పంజాబ్‌కు విడదీయరాని బంధం ఉందన్నారు. కేంద్రం చర్యలను చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.