రాజధాని కోసం భూసేకరణకు సర్కార్ కసరత్తు

GNTR: రాజధాని నిర్మాణం కోసం మలి విడత భూ సమీకరణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. తుళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి, పెదకాకాని మండలాల్లోని 14 గ్రామాల్లో భూములు సేకరించనున్నారు. 2015లో జరిగిన తొలి విడతలో మిగిలిపోయిన కొన్ని గ్రామాలు కూడా ఈసారి జాబితాలో ఉన్నాయి. రైల్వేలైన్ నిర్మాణం కోసం ఈ సమీకరణ ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు.