పారాది కాజ్వేను పరిశీలించిన రెవెన్యూ అధికారులు
VZM: బొబ్బిలి మండలం పారాది కాజ్వేను ఎమ్మార్వో ఎం.శ్రీను పరిశీలించారు. పెద్దగెడ్డ గేట్లు ఎత్తడంతో వేగావతి నది ఉద్ధృతంగా ప్రవహించడంతో కాజ్వే పైనుంచి వరదనీరు ప్రవహిస్తుంది. దీంతో భారీ వాహనాలను దారి మళ్లించినట్లు చెప్పారు. అనంతరం కంచరగెడ్డ ప్రాజెక్టును పరిశీలించారు. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.