పుంగనూరులో జాతరకు ఆలయం ముస్తాబు
CTR: పుంగనూరు సుగుటూరు గంగమ్మ జాతరకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. గంగమ్మను కొలువుదీర్చే గర్భాలయానికి శనివారం రంగులు వేశారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్యాలెస్ ఆవరణంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు పిచ్చి మొక్కలను తొలగించారు.