కంకిపాడులో అధికారులు పర్యటన

కంకిపాడులో అధికారులు పర్యటన

కృష్ణా: కంకిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని వరద ప్రభావిత గ్రామాలను ఉయ్యురు ఆర్‌డీవో బీ.హేల షారోన్, సీఐ జే.మురళీ కృష్ణ, ఎంఆర్‌వో భవన్నారాయణ, ఎస్సై డీ.సందీప్ గురువారం సందర్శించారు. గ్రామాల్లో ఉన్న వరద పరిస్థితిని పరిశీలించారు. అనంతరం గ్రామస్థుల సమస్యలు తెలుసుకొని, అవసరమైన సహాయక చర్యలపై చర్చించారు. వరదలు నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.