మండపేటలో పటేల్ జయంతి సందర్భంగా యూనిటీ మార్చ్
మండపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా స్థానిక కలవపువ్వు కూడలి నుండి మారేడుబాక కళాశాల వరకు యూనిటీ మార్చ్ ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండపేట మున్సిపల్ కమిషనర్ టీవీ రంగారావు పాల్గొని జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద పటేల్ చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు.