హత్యాయత్నం కేసులో ఇద్దరు అరెస్ట్
KDP: చిన్నచౌక్ పోలీస్ పరిధిలో ఆస్తి వివాదం నేపథ్యంలో అన్నపై దాడి చేసిన తమ్ముడు గురుబాబు, బోనం వెంకటేష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 19న జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసి 22న రిమాండ్‌కు తరలించారు. దాడిలో గాయపడిన గురుక్రిష్ణ చికిత్స పొందుతున్నాడు. కేసును SI ప్రతాప్ రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.