అసత్య ఆరోపణలపై న్యాయ పోరాటం చేస్తా: సర్పంచ్
TPT: తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న ప్రహ్లాద్ అనే యూట్యూబర్‌పై న్యాయ పోరాటం చేస్తానని డక్కిలి మండలం వెంబులూరు పంచాయతీ సర్పంచ్ చాముండేశ్వరి తెలిపారు. గ్రామ పంచాయతీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్న తనపై కమ్మపల్లికి చెందిన ప్రహ్లాద్, మరికొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రతి రూపాయికి లెక్క ఉందన్నారు.