కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న ప్రభుత్వ విప్

SRCL: ఓట్ల గల్లంతుపై కాంగ్రెస్ పార్టీ ఆరోపణలను ఎన్నికల కమిషన్ పట్టించుకోవడం లేదని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. సిరిసిల్లలో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొని ఆయన మాట్లాడుతూ.. 'ఓట్ చోర్ గద్దె చోడ్' నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నట్లు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఓట్ల దొంగతనానికి పాల్పడిందని ఆయన ఆరోపించారు.