ఫుట్‌బోర్డు పై ప్రయాణం

ఫుట్‌బోర్డు పై ప్రయాణం

కృష్ణా: ఉంగుటూరు మండలం తేలప్రోలులో ఆర్టీసీ బస్సులో విద్యార్థులు ఫుట్‌బోర్డు  వద్ద నిలబడుతూ ప్రయాణిస్తున్నారు. ఈ పరిస్థితి విద్యార్థుల ప్రాణాలకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పరిమితికి మించి ఎక్కించవద్దని కోరుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలంటున్నారు.