నెక్కొండలో వ్యాస రచన పోటీలు
WGL: నెక్కొండ మండల కేంద్రంలోని TGSWRS పాఠశాలలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం కింద రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక ఎస్సై ఆధ్వర్యంలో వ్యాస రచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని విద్యార్థులకు అవగాహన కల్పించారు.