VIDEO: హిందూ సమ్మేళనం కరపత్రాల ఆవిష్కరణ
CTR: సోమలలలో జనవరి 4న నిర్వహించే హిందూ సమ్మేళనం విజయవంతం చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. సోమల శ్రీకృష్ణదేవరాయలు సర్కిల్ సమీపంలో ఏర్పాటు చేస్తున్న సభా స్థలాన్ని బుధవారం వారు పరిశీలించారు. అనంతరం సమ్మేళనానికి సంబంధించి కరపత్రాలను ఆవిష్కరించారు. ఉదయం 9 గంటలకు ర్యాలీ ప్రారంభం చేసి, బస్టాండ్ కూడలి మీదుగా సభా ప్రాంగణం చేరుకుంటుందని నిర్వాహకులు తెలిపారు.