'నేలతల్లి కార్యాలయాన్ని సందర్శించిన నాబార్డ్ డీడీయం'

BHNG: గుండాల మండలం సుద్దాల గ్రామంలోని నేలతల్లి కార్యాలయాన్ని సోమవారం నాబార్డ్ జిల్లా అభివృద్ధి అధికారి సందర్శించారు. భూసార పరీక్ష యంత్రాన్ని, రిపోర్టులను పరిశీలించి వారి పనితీరును తెలుసుకున్నారు. సీయస్ఏ సంస్థ సహకారంతో ఇతర జిల్లాల రైతుల మట్టి పరీక్ష చేయనున్నారు. దీంతో నేలతల్లికి కొంత ఆదాయం కూడా వస్తుందని డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.