VIDEO: వింత వ్యాధి.. అధికారుల సర్వే

SRD: సిర్గాపూర్ మండలం రూప్లా తండాలో వింత వ్యాధి పట్టి పీడిస్తుందని గ్రామస్తులు తెలిపారు. గత రెండు వారాలు నుంచి మోకాళ్లు, కీళ్ల నొప్పులు, జ్వరాలతో బాధపడుతూ.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. MPO బ్రహ్మం, సెక్రటరీ గౌతమ్, వైద్య సిబ్బంది గ్రామాన్ని సందర్శించి ఇంటింటికి తిరిగి వ్యాధిపై ఆరా తీశారు. అయితే విషమ పరిస్థితులు ఏమీ లేవని MPO తెలిపారు.