మండలాల మార్పుపై వినతి
KDP: సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలను కడప జిల్లాలోనే కొనసాగించాలని రాయలసీమ కమ్యూనిస్టు రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ పరిపాలన అధికారికి శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ రెండు మండలాలు కడపకు సమీపంలో ఉన్నాయన్నారు. వీటిని 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్నమయ్య జిల్లాలో కలపొద్దని విన్నవించారు.