సాగునీటి కాలువలో పడి బొబ్బిలి వాసి మృతి
VZM: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలంలోని కోటిపల్లి సమీపంలో సాగునీటి కాలువలో ప్రమాదవశాత్తూ పడి బొబ్బిలి మండలం ఎం. బూర్జవలస గ్రామానికి చెందిన పిట్ట అప్పలనాయుడు (36) మృతి చెందాడు. వారం రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెళ్లారు. ఈ ఘటనతో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.