VIDEO: పందులు స్వైర విహారముతో అపరిశుభ్రత
SKL: నరసన్నపేట బొంతల వీధి వద్ద అపరిశుభ్రం తాండవిస్తుంది. స్థానికులు వ్యర్థాలను ఆ ప్రాంతంలో వేయడం వల్ల పందులు అక్కడకు చేరి చెల్లాచెదురుగా చేస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా దుర్గంధం వ్యాపిస్తోంది. దోమల వ్యాప్తి కూడా అధికంగా ఉందని, అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో పందులు స్వైర విహారం చేస్తున్నాయని చెప్పారు.