ప్రత్యేక అలంకరణలో శ్రీ విరుపాక్షి మారెమ్మ అమ్మవారు

ప్రత్యేక అలంకరణలో శ్రీ విరుపాక్షి మారెమ్మ అమ్మవారు

CTR: వసంత పంచమి శుక్రవారం కావడంతో పుంగనూరు పట్టణం పాత బస్టాండ్ సమీపాన గల శ్రీ విరుపాక్షి మారెమ్మ ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. అర్చకులు ఉదయ పూర్వమే అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొల్పారు. తర్వాత ఫల పంచామృతలతో పాటు వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి, ప్రత్యేకంగా అలంకరణలో పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.