సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సత్యసాయి: ఆమడగూరు మండలంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి చేతుల మీదుగా పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక చెక్కులను అందజేశారు. ప్రజల సమస్యలను స్వీకరించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు.