బొమ్మెనలో ముగిసిన ధాన్యం కొనుగోళ్లు

బొమ్మెనలో  ముగిసిన ధాన్యం కొనుగోళ్లు

JGL: కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామంలో సెర్ప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోళ్లు ముగిసినట్లు ఏపీఎం చిన్న రాజయ్య తెలిపారు. గ్రామంలోని 165 మంది రైతుల వద్ద 8,424 క్వింటాళ్ల వరి ధాన్యం కొనుగోలు చేశామని ఆయన పేర్కొన్నారు. గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు సక్రమంగా నిర్వహించేందుకు రైతులు, సిబ్బంది సహకరించడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.