మార్కండేయ మందిర నిర్మాణానికి రూ.1,01,116 విరాళం
JGL: మెట్‌పల్లి పట్టణంలో శ్రీ శివభక్త మార్కండేయ మందిర పునర్నిర్మాణానికి బాస బలరాంమూర్తి-హారిక దంపతులు రూ.1,01,116ల విరాళాన్ని శనివారం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారిని పలువురు అభినందించారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు ద్యావనపల్లి రాజారాం, నాయకులు ఆనంద్, నాగరాజు, భాస్కర్, నడిమెట్ల సత్యనారాయణ, మ్యానప్రసాద్, గణేష్, పాల్గొన్నారు.