పాగుంట వెంకన్నకు బంగారం వితరణ

GDWL: కేటిదొడ్డి మండలం వెంకటాపురం కొండపై వెలసిన పాగుంట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కర్ణాటక రాయచూర్‌కు చెందిన గోనెల గోవిందు, రాములమ్మ కుటుంబ సభ్యులు ఆలయానికి తమ వంతు సహాయంగా అర తులం బంగారం ఆలయ నిర్వాహకులకు ఆదివారం అందజేశారు. ఆలయ సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక పూజలు చేయించి శాలువాతో సత్కరించారు.