జాతీయ స్థాయి చెస్ పోటీలకు ఎంపికైన రాజ్యలక్ష్మి

జాతీయ స్థాయి చెస్ పోటీలకు ఎంపికైన రాజ్యలక్ష్మి

MLG: జాతీయ స్థాయి చెస్ పోటీలకు వాజేడు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఎంప్లాయిస్ రాష్ట్రస్థాయి చెస్ ఛాంపియన్ షిప్ పోటీల్లో రాణించి జాతీయస్థాయికి ఎంపికయ్యారు. ఆదివాసీ ఉద్యోగిని జాతీయస్థాయికి ఎంపిక కావడం పట్ల అధికారులు, పాఠశాల సిబ్బంది అభినందించారు.