బాధ్యతలు స్వీకరించిన వరంగల్ డీఈవో

వరంగల్ డీఈవోగా బి. రంగయ్య నాయుడు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. డీఈవో జ్ఞానేశ్వర్ అక్రమాల ఆరోపణల నేపథ్యంలో రంగయ్యకు FAC DEOగా బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ సత్య శారద శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రంగయ్య ఆదివారం డీఈవో ఆఫీసుకు వచ్చి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రంగయ్యకు శుభాకాంక్షలు తెలిపారు.