నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన
MDK: జిల్లా డీసీసీబీ ఉద్యోగులకు మంజూరైన ఇన్సెంటివ్స్‌ను రికవరీ చేయాలనే నిర్ణయాన్ని నిరసిస్తూ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. టీసీసీబీఈఏ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ ఆందోళనను రెండో దశకు తీసుకెళ్తున్నామని యూనియన్ అధ్యక్షుడు ప్రసాద్ గౌడ్ తెలిపారు. ఇందులో భాగంగా రేపటి నుంచి అధికారులకు వినతి పత్రాలు అందజేస్తామన్నారు.