నవగ్రహ విగ్రహాల ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే

నవగ్రహ విగ్రహాల ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే

BHPL: గణపురం మండల కేంద్రంలోని రామాలయంలో ఆదివారం శివలింగం, నవగ్రహ విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా జరిగింది. భక్తిశ్రద్ధలతో కనులపండుగగా సాగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ కమిటీ, గ్రామస్థులు ఎమ్మెల్యేకు శాలువాతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.