వెదురు బొమ్మల తయారీపై శిక్షణ

వెదురు బొమ్మల తయారీపై శిక్షణ

ELR: గిరిజన స్వయం సహాయక సంఘ మహిళలకు జీవనోపాధులు మెరుగుపర్చేందుకు త్వరలో శిక్షణా కార్యక్రమం నిర్వహించదలచినట్లు జిల్లా కలెక్టర్ కే.వెట్రిసెల్వి తెలిపారు. సోమవారం స్ధానిక కలెక్టరేట్‌లో కొంతమంది గిరిజన మహిళలు వెదురు కర్రలతో తయారుచేసిన ఉత్పత్తులను పరిశీలించారు. వెదురు ఉత్పత్తులను తయారుచేసే గిరిజన మహిళలకు 45 రోజులపాటు శిక్షణ అందించి అవసరమైన రుణాలు ఇస్తామన్నారు.