కొండపర్తి 12వ వార్డులో కరెంటు స్తంభాల పరిశీలన

కొండపర్తి 12వ వార్డులో కరెంటు స్తంభాల పరిశీలన

HNK: ఐనవోలు మండలం కొండపర్తి గ్రామ సర్పంచ్ కంజర్ల అశోక్ రావు, 12వ వార్డు మెంబర్ కట్కూరి దివ్య అరుణ్ కుమార్‌తో కలిసి మంగళవారం 12వ వార్డులో కొత్త కరెంటు స్తంభాల ఏర్పాటుకు పరిశీలన చేపట్టారు. అవసరమైన చోట్ల వెంటనే స్తంభాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని సర్పంచ్ తెలిపారు.