కలెక్టర్ కార్యాలయానికి 230 వినతులు
VZM: జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్)కు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో మొత్తం 230 వినతులు స్వీకరించినట్లు ఆయన తెలిపారు. స్వీకరించిన ఫిర్యాదులపై సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.