ఒకే వార్డులో ఒకే వ్యక్తికి 4 ఓట్లు
TG: పంచాయతీ ఎన్నికల వేళ అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఒకే వార్డులో ఒకే వ్యక్తికి 4 ఓట్లు ఉండటం చర్చనీయాంశమైంది. నాగర్‌కర్నూల్(D) ఉప్పునుంతల(M) గువ్వలోనిపల్లి గ్రామం ఒకటో వార్డులో దుగ్గి మధు అనే వ్యక్తి సీరియల్ నం.56 నుంచి 59 వరకు ఓటరుగా నమోదయ్యాడు. చివరి రెండేళ్ల కాలంలో మరణించినవారి ఓట్లు కూడా అలాగే ఉండటంతో అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.