VIDEO: పుంగనూరు రోడ్డుపై శునకాల సంచారం
CTR: పుంగనూరులోని ప్రధాన రహదారులు, వీధుల్లో బుధవారం శునకాల సంచారం ఎక్కువైంది. కొత్తపేట, కొత్తయిండ్లు ప్రాంతాల్లో వృద్ధులు, చిన్నారులపై దాడి చేస్తున్నాయి. బైకులను సైతం వెంబడించి కరుస్తున్నాయి. కుక్కలకు సంతాన నిరోధక టీకాలు వేసి అదుపు చేయాలని స్థానికులు కోరుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.