చికెన్ ప్రియులకు శుభవార్త.. తగ్గిన ధరలు
కోనసీమ: అమలాపురం లో మాంసం ధరలు స్వల్పంగా తగ్గాయని వ్యాపారస్తులు చెప్తున్నారు. బ్రాయిలర్ చికెన్ ధర రూ.260, ఫారం కోడి మాంసం రూ.200, మటన్ రూ.800 చొప్పున అమ్ముతున్నారు. అలాగే చేపలు రకాన్ని బట్టి కేజీ రూ.130 నుంచి రూ.150 వరకు అమ్ముతున్నామని, ప్రాంతాలను బట్టి ధరల మార్పులలో కొద్దిగా వ్యత్యాసం ఉంటుందని వ్యాపారస్తులు తెలిపారు.