అప్పుడే చనిపోయేవాడిని: కోన వెంకట్
టాలీవుడ్ నిర్మాత కోన వెంకట్ తన గతాన్ని గుర్తు చేసుకుంటూ షాకింగ్ విషయాలు పంచుకున్నాడు. కెరీర్ కష్టాల్లో ఉన్నప్పుడు చెన్నై బీచ్‌లో 50 నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని, కానీ అక్కడ కాళ్లు, చేతులు లేని ఓ అమ్మాయి బెలూన్లు అమ్ముతూ కనిపించిందని తెలిపాడు. ఆమెను చూశాక తనలో ధైర్యం కలిగిందని, ఆ అమ్మాయే తన ప్రాణాన్ని కాపాడిందని అన్నాడు.