సాగు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే

సాగు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే

మన్యం: కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరీ శనివారం జియ్యమ్మవలస మండలం రావాడలో వట్టిగెడ్డ రిజర్వాయర్‌ నుంచి సాగునీటిని విడుదల చేశారు. ఈ ఖరీఫ్‌ సీజన్‌కు ఆయకట్టు చివరి వరకు సాగునీరు అందించేలా చర్యలు చేపట్టామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, రైతుల ఆర్ధిక అభివృద్దే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.