మునగాల పోలీస్ వినూత్న ఆలోచన
SRPT: మునగాల మండల పరిధి జాతీయ రహదారి 65 పై వేసవికాలంలో పశువుల వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో భాగంగా మునగాల మండల పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిపై ప్రత్యేక చర్యలు తీసుకుని మండల పోలీసులు ఈరోజు ముకుందాపురం గ్రామంలో గేదెలకు రెడ్ రేడియం స్టిక్కర్లు అంటించడం జరిగిందని మునగాల సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు.