ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

KMM: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఏసీ మిర్చి ధర క్వింటా రూ.14,500, నాన్ ఏసీ మిర్చి క్వింటా రూ.8,800, అటు క్వింటా పత్తి ధర రూ.7,750 జెండా పాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. మార్కెట్ నడిచిన రోజుతో పోల్చితే నాన్ ఏసీ మిర్చి రూ.300 పెరగగా.. పత్తి ధర రూ.100 తగ్గగా.. అటు ఏసీ మిర్చి ధర స్థిరంగా ఉంది.