11 కోట్ల లిఖిత రామకోటి పుస్తకాలకు పూజ

11 కోట్ల లిఖిత  రామకోటి పుస్తకాలకు పూజ

SDPT: రామకోటి నామాన్ని రాస్తూ మరొకరిచే రాయించి తరించాలని భక్తి రత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు అన్నారు. శుక్రవారం గజ్వేల్ పట్టణంలో రామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక అద్దాల మందిరంలో శ్రీ సీతారామ చంద్రుల వద్ద 11 కోట్ల లిఖిత రామ నామాల పుస్తకాలను ఉంచి పూజలు చేశారు. రామ నామాన్ని రాసే భక్తులు పుస్తకాలు తీసుకోవాలన్నారు.