ఆక్రమణ తొలగించాలని నిరాహార దీక్ష

W.G: ఆకివీడు మండలం అజ్జమూరు గ్రామపంచాయతీ వద్ద వద్దినీడి వరప్రసాద్ గురువారం నిరాహారదీక్షకు దిగారు. గ్రామ సచివాలయం ఎదురుగా ప్రధాన రహదారి మలుపు వద్ద దాసరి రాము రోడ్డు మార్జిన్ ఆక్రమించడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు దృష్టికి తీసుకెళ్లానన్నారు. పలువురు చనిపోయిన అధికారులు స్పందించలేదని నిర్లక్ష్య వైఖరి వల్ల సమస్య పరిస్కారం కాలేదన్నారు