VIDEO: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పండ్లు, దుప్పట్ల పంపిణీ

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో శుక్రవారం బాలింతలకు దుప్పట్లు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోరం అధ్యక్షులు పసుల రాజు మాట్లాడుతూ.. ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల దృష్ట్యా బాలింతలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించామని వెల్లడించారు.